“బంగార్రాజు” 13 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

Published on Jan 28, 2022 12:30 am IST

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “బంగార్రాజు”. జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి పోటీగా పెద్ద చిత్రాలేవి లేకపోవడంతో ఈ మల్టీస్టారర్ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. అంతేకాదు వసూళ్లను కూడ బాగానే రాబట్టుకుంటుంది.

అయితే విడుదలై ఈ చిత్రం 13 రోజుల రన్ పూర్తి చేసుకుంది. కాగా ఈ 13 రోజుల్లో కలిపి మొత్తం 33.52 కోట్ల నెట్, 54.30 కోట్ల మేర గ్రాస్ వసూల్ చేసింది. ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మరో మూడున్నర కోట్లు వసూలయ్యాయి. అయితే విడుదలకు ముందు 38 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా 39 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను ఫిక్స్ చేసుకుంది. అయితే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 36.70 కోట్లు వసూలయ్యాయి. మరో 2.30 కోట్లు రాబడితే ఈ సినిమా సాలీడ్ హిట్ అందుకున్నట్టే అని అంటున్నారు.

సంబంధిత సమాచారం :