‘జీ 5’లో “బంగార్రాజు” హవా.. ఒక్క వారంలోనే 500 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్..!

Published on Feb 27, 2022 12:00 am IST

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “బంగార్రాజు”. జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మల్టీస్టారర్ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఈ చిత్రం ఫిబ్రవరి 18 నుంచి ‘జీ 5’ ఓటీటీ వేదికగా అందుబాటులోకి వచ్చింది.

అయితే బిగ్ స్క్రీన్‌పై పలు రికార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ వేదికగా కూడా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతూ రికార్డులను వెనకేస్తుంది. జీ 5 లో స్ట్రీమింగ్‌లోకి వచ్చిన వారంలోనే 500 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ అవ్వడంతో ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఒక సరికొత్త రికార్డ్‌ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఇందులో నాగ్ సరసన జోడీగా రమ్య కృష్ణ, నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టిలు నటించారు.

సంబంధిత సమాచారం :