బంగార్రాజు చివరి రోజు షూటింగ్… పండగ లాంటి సినిమా అంటూ నాగ్ వ్యాఖ్యలు!

Published on Dec 23, 2021 12:47 pm IST

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టి లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సంయుక్తం గా నిర్మిస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయన చిత్రం కి కొనసాగింపు గా వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

నాగ చైతన్య, నాగార్జున మరొకసారి కలిసి నటిస్తున్న చిత్రం కావడం తో సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ఒక అప్డేట్ పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. నేటి తో ఈ చిత్రం షూటింగ్ లాస్ట్ డే అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాక ఈ సినిమా లో ఇంకో అదిరి పోయే పాట ఉందంటూ చెప్పుకొచ్చింది. అక్కినేని నాగార్జున ఇందుకు సంబంధించిన ఒక ఫోటో ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది. పండగ లాంటి సినిమా, బంగార్రాజు త్వరలో వస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా విడుదల పై త్వరలో క్లారిటీ రానుంది.

సంబంధిత సమాచారం :