రేపటి నుంచి ‘బంగార్రాజు’ కొత్త షెడ్యూల్.. ఫస్ట్ లిరికల్ కూడా రేపే?

Published on Nov 9, 2021 12:02 am IST

‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న అక్కినేని నాగార్జున ఆ సినిమాకు సీక్వెల్‌గా ప్రస్తుతం ‘బంగార్రాజు’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా, నాగ చైతన్య సరసన హీరోయిన్‌గా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వగా, రేపటి నుంచి మైసూరులో కొత్త షూటింగ్ షెడ్యూల్‌ని స్టార్ట్ చేసుకోబోతుంది. ఈ మేరకు చిత్ర బృందం అంతా ప్రత్యేక చార్టెడ్ విమానంలో మైసూర్‌లో దిగింది. ఈ షెడ్యూల్‌లో పలు ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే రేపు ఉదయం 9:09 గంటలకు ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో ‘లడ్డుందా’ను రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. కాగా రొమాన్స్, ఎమోషన్స్ మరియు ఇతర కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :