సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమైన బంగార్రాజు?

Published on Nov 30, 2021 9:30 pm IST


అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టి లు ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం బంగార్రాజు. ఈ చిత్రం సోగ్గాడే చిన్ని నాయన చిత్రం కి కొనసాగింపు గా సాగుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం ను జనవరి 15 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి ల భీమ్లా నాయక్ జనవరి 12 కి వస్తుండగా, 14 వ తేదీన ప్రభాస్ రాధే శ్యామ్ రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :