సంక్రాంతి బరిలో “బంగార్రాజు”…జనవరి 14 న విడుదల!

Published on Jan 5, 2022 7:11 pm IST

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో అక్కినేని నాగార్జున, నాగ చైతన్య ల అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బంగార్రాజు సంక్రాంతికి అన్ని వర్గాల ప్రేక్షకులకు ఫుల్ మీల్ ఫీస్ట్ అందించడానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం జనవరి 14న పండుగకు థియేటర్లలోకి రానుంది. సంక్రాంతికి విడుదలైన సోగ్గాడే చిన్ని నాయనా పండుగకు బాక్సాఫీస్ విజేతగా నిలిచింది. ఇప్పుడు, బంగార్రాజు చరిత్రను తిరగరాయడం ఖాయం. ఎందుకంటే పండుగ సీజన్‌లో సినిమా అభిమానులకు కుటుంబ చిత్రాలు ఎల్లప్పుడూ ప్రధాన ఎంపికగా ఉంటాయి, అంతేకాకుండా ఈ చిత్రం టీజర్ మరియు పాటలకు అద్భుతమైన స్పందనతో అసాధారణమైన బజ్‌ను సొంతం చేసుకుంది. సోగ్గాడే చిన్ని నాయనకు నాగార్జున అద్భుతమైన నటన ప్రధాన ఆకర్షణగా నిలవగా, ఈ సారి చిన్న బంగార్రాజు పాత్రలో నాగ చైతన్య నటించనున్నారు.

నాగార్జున భార్యగా రమ్య క్రిష నటిస్తుండగా, నాగ చైతన్యకు జంటగా కృతి శెట్టి కనిపించనుంది. జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఒక ప్రత్యేక గీతం లో ఆడి పాడింది. ఈ చిత్రం లో నాగబాబు ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ యువరాజ్, సంగీతం అనూప్ రూబెన్స్ లు అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి జీ స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. నాగార్జున నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాయడం జరిగింది. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ మరియు ఝాన్సీ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :