“బంగార్రాజు” సెకండ్ వీక్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

“బంగార్రాజు” సెకండ్ వీక్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

Published on Jan 25, 2022 12:00 AM IST

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “బంగార్రాజు”. జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి పోటీగా పెద్ద చిత్రాలేవి లేకపోవడంతో ఈ మల్టీస్టారర్ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. అంతేకాదు వసూళ్లను కూడ బాగానే రాబట్టుకుంటుంది.

అయితే బంగార్రాజు పదో రోజు కలెక్షన్స్ కాస్త పుంజుకున్నట్టు తెలుస్తుంది. ఆంధ్ర తెలంగాణ కలిపి ఆదివారం ఈ సినిమా రూ.81 లక్షలు షేర్ తో రూ.1.45 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెప్పుకొచ్చాయి. మొత్తం మీద ఈ పది రోజుల్లో ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.34.01 కోట్లు షేర్ తో రూ.53.70 కోట్లు గ్రాస్ సాధించింది. దీనికి ఓవర్ సీస్ రూ.1.67 కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ. 1.43 కోట్లు కలెక్షన్స్ కలిపితే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.37.11 కోట్ల షేర్ తో రూ.60.50 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తుంది. ఇక అన్ని ఏరియాల నుంచి ఇప్పటివరకు కలెక్షన్లను చూసుకుంటే 10 రోజుల్లో ఈ చిత్రం 97.60% రికవరీ చేసినట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు