డిఫరెంట్ మేకోవర్ లో నాగ చైతన్య…బంగార్రాజు టీజర్ అదరహో!

Published on Nov 23, 2021 11:37 am IST


అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలు గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం బంగార్రాజు. రమ్య కృష్ణ, కృతి శెట్టి లు లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సోగ్గాడే చిన్ని నాయన చిత్రం కి కొనసాగింపు గా రావడం, అంతేకాక నాగార్జున మరియు నాగ చైతన్య మరోసారి వెండితెర పై కలసి నటిస్తుండటం తో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం నుండి విడుదల అయిన నాగ చైతన్య లుక్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా అక్కినేని నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్ లో అక్కినేని నాగ చైతన్య డిఫెరెంట్ మేకోవర్ లో కనిపిస్తున్నారు. యెల్లో షర్ట్ తో, జీన్స్ ప్యాంట్ తో బుల్లెట్ ను నడిపేందుకు సిద్దం అయ్యారు చైతన్య. ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :