బంగార్రాజు టీజర్ కి ముహూర్తం ఫిక్స్!

Published on Dec 31, 2021 1:00 pm IST

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టి లు ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం బంగార్రాజు. ఈ చిత్రం ను జీ స్టూడియోస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ పై ఒక క్లారిటీ వచ్చింది. చిత్ర యూనిట్ టీజర్ విడుదల కి ముహూర్తం ఫిక్స్ చేయడం జరిగింది. అందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది. ఈ చిత్రం టీజర్ ను జనవరి 1, 2022 ఉదయం 11:22 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఈ చిత్రం లో రావు రమేష్, బ్రహ్మాజీ వెన్నెల కిషోర్, ఘాన్సి, అనిత చౌదరీ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :