ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా “బంగార్రాజు” ట్రైలర్

Published on Jan 11, 2022 5:45 pm IST


అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, కృతి శెట్టి, రమ్య కృష్ణ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం బంగార్రాజు. సోగ్గాడే చిన్ని నాయన చిత్రం కి కొనసాగింపు గా వస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సంయుక్తం గా నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని జనవరి 14 వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఎలా ఉండనుంది అనేది ట్రైలర్ ను చూస్తే అర్ధం అవుతుంది. ఈ పండుగ కి సిసలైన సందడి చేసేందుకు బంగార్రాజు వస్తున్నట్లు తెలుస్తోంది. మరొకసారి నాగార్జున, నాగ చైతన్య లు కలిసి నటిస్తున్న చిత్రం కావడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం లో రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :