వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బంగార్రాజు…ఎప్పుడంటే?

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బంగార్రాజు…ఎప్పుడంటే?

Published on Mar 25, 2022 4:02 PM IST

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా నటించిన చిత్రం బంగార్రాజు. రమ్య కృష్ణ, కృతి శెట్టి లు ఈ చిత్రం లో హీరోయిన్స్ గా నటించారు. సోగ్గాడే చిన్ని నాయన చిత్రం కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతోంది.

ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగు లో ప్రసారం కానుంది. ఈ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు ప్రసారం కానుంది. జీ స్టూడియోస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ ల పై ఈ చిత్రాన్ని సంయుక్తం గా నిర్మించడం జరిగింది. బుల్లితెర పై ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను దక్కించుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు