బంగార్రాజు లేటెస్ట్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

Published on Jan 26, 2022 4:00 pm IST


సంక్రాంతి సందర్భంగా చాలా కాలిక్యులేటివ్‌గా విడుదలైన సినిమా బంగార్రాజు. సినిమాలన్నీ వాయిదా పడుతూ వస్తున్న వేళ నాగ్ ముందుకొచ్చి సినిమాను విడుదల చేశాడు. హాలిడే సీజన్ కావడంతో సినిమా మంచి వసూళ్లు రాబట్టింది.

ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే, ఈ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 36 కోట్ల షేర్ ని క్రాస్ చేసింది. ఈ సినిమా ఇప్పుడు పలు ఏరియాల్లో స్లో అయిపోయి రన్ దగ్గర పడుతోంది. కానీ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో నాగ్ అండ్ టీం మంచి వసూళ్లు రాబట్టింది. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టి లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

సంబంధిత సమాచారం :