“బంగార్రాజు” సెకండ్ సింగిల్‌కి ముహూర్తం ఫిక్స్..!

Published on Nov 30, 2021 2:02 am IST


అక్కినేని నాగార్జున, నాగ చైతన్యలు కలిసి నటిస్తున్న తాజా చిత్రం “బంగార్రాజు”. ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా, నాగ చైతన్య సరసన హీరోయిన్‌గా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుంది.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు సినిమాపై మరిన్ని అంచనాలను పెంచాయి. అయితే తాజాగా ఈ సినిమా సెకండ్ సింగిల్‌కి ముహూర్తాన్ని ఫిక్స్ చేసింది చిత్ర బృందం. “నా కోసం” అంటూ సాగే పాట టీజర్‌ను డిసెంబర్ 1వ తేది ఉదయం 11:12 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు తెలిపింది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :