బంగార్రాజు ప్రమోషన్స్ ను మొదలెట్టనున్న టీమ్!

Published on Jan 8, 2022 2:02 am IST

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టి లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం బంగార్రాజు. సోగ్గాడే చిన్ని నాయన చిత్రం కి కొనసాగింపు గా వస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాగార్జున మరియు నాగ చైతన్య లు మరొకసారి వెండితెర పై కలిసి నటిస్తున్న చిత్రం కావడం తో సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా ను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ వేగవంతం చేయనుంది. నాగార్జున, నాగ చైతన్య, కృతి శెట్టి లు ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :