వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “బంగార్రాజు”… ఎప్పుడంటే?

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “బంగార్రాజు”… ఎప్పుడంటే?

Published on Mar 22, 2022 10:53 PM IST


అక్కినేని నాగార్జున, నాగ చైతన్య లు ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. కృతి శెట్టి, రమ్య కృష్ణ లు హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రం ను సోగ్గాడే చిన్ని నాయన చిత్రం కి కొనసాగింపు గా తీయడం జరిగింది. జీ స్టూడియోస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. థియేటర్ల లో విడుదల అయిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.

ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది. ‘బంగార్రాజు’ ను ఈ ఆదివారం, మార్చ్ 27 సాయంత్రం 5.30 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ టీవీ లో ప్రసారం కానుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను దక్కించుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు