రేపు ముంబైలో బప్పి లాహిరి అంత్యక్రియలు

Published on Feb 16, 2022 1:00 pm IST


భారతీయ సంగీత చరిత్రలో ఇదొక బ్లాక్ డే. డిస్కో రాజు బప్పి లాహిరి(69) ముంబై లోని క్రిటికేర్ హాస్పిటల్‌ లో పలు ఆరోగ్య సమస్యలతో బుధవారం తెల్లవారు జామున కన్నుమూశారు. భారతదేశంలో డిస్కో సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన బప్పి లాహిరి అంత్యక్రియలు లాస్ ఏంజెల్స్ నుండి అతని కుమారుడు బప్పా లాహిరి రాకతో రేపు ముంబైలో నిర్వహించనున్నారు.

నవంబర్ 27, 1952న పశ్చిమ బెంగాల్‌లో జన్మించిన బప్పి లహిరి 5000 కి పైగా పాటలకు మరియు అనేక భారతీయ భాషల్లో మరిన్ని సినిమాలకు సంగీతం అందించారు. దిగ్గజ సంగీత దర్శకుడు, గాయకుడి మృతి పట్ల ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

సంబంధిత సమాచారం :