పేదల కోసం ఆగష్టులో బాలయ్య క్యాన్సర్‌ హాస్పిటల్ నిర్మాణం !

Balakrishna

అమరావతిలో ‘ఇండో అమెరికన్‌ బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్’ను నిర్మించటానికి బాలకృష్ణ సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం బాలయ్య సీఆర్డీయే అధికారులను వెంటబెట్టుకొని తుళ్లూరు పరిధిలోని 13.50 ఎకరాల నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. అలాగే అనంతపురం పరిధిలోని ఎకరంన్నర స్థలం కలుపుకొని మొత్తం 15 ఎకరాలను సీఆర్డీయే హాస్పిటల్ నిర్మాణానికి కేటాయించింది.

కాగ వెయ్యి పడకల’ఇండో అమెరికన్‌ బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్’ కోసం ఆగష్టులో ప్రత్యేకంగా భూమిపూజ చేసి నిర్మాణం చేపట్టనున్నారు. పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించడంతో పాటు మరీ పేదవారికి కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటుచేసి ఆర్థిక సహాయం కూడా అందిస్తామని బాలయ్య ప్రకటించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ఈ హాస్పటల్‌ ను దేశంలోనే నెంబర్‌ వన్‌ కేన్సర్‌ హాస్పటల్‌ గా బసవతారకం కేన్సర్‌ హాస్పిటల్ ను నిర్మిస్తామని బాలకృష్ణ తెలిపారు.

Exit mobile version