పవన్ కోసం బేసిక్ లైన్ రెడీ..రవితేజ నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Feb 8, 2022 4:15 pm IST

మన టాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎప్పుడు లేని సాలిడ్ లైనప్ ని ఇప్పుడు సెట్ చేసుకొని మంచి ఆసక్తి రేపాడు. ఒకదాన్ని మించిన మరొక సినిమాని పవన్ లైనప్ లో పెట్టి శరవేగంగా చిత్రీకరణ చేస్తున్నారు. అయితే ఆల్రెడీ ఇప్పుడు పవన్ కెరీర్ లో కొన్ని సినిమాలు ఓకే అయ్యి ఉన్న సంగతి తెలిసిందే.

వాటిలో ఆల్రెడీ ఒకటి షూటింగ్ కంప్లీట్ అయ్యి రిలీజ్ కి రెడీగా ఉండగా మరో భారీ సినిమా సగం కంప్లీట్ అయ్యింది. అయితే పవన్ లాంటి స్టార్ తో ఏ దర్శక నిర్మాతలు అయినా కూడా సినిమా చెయ్యాలని కోరుకుంటారు. మరి అలానే తాము కూడా రెడీ అన్నట్టు మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం “ఖిలాడి” నిర్మాత కోనేరు సత్యన్నారాయణ రీసెంట్ గా కొన్ని కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది.

తాను ఓ సారి పవన్ ని కలవడం జరిగింది అని ఆ టైం లో పవన్ కోసం ఒక కథ తాలుకా బేసిక్ లైన్ ఉందని చెప్పగా తాను సానుకూలంగానే స్పందించారని, అయితే తమ కాంబోలో సినిమా లేదని ఇప్పుడప్పుడే చెప్పలేము అలాగని సినిమా ఉందని ఇప్పుడప్పుడే చెప్పలేము అని చెప్పారు. ఫైనల్ గా అయితే పవన్ కోసం తమ దగ్గర ఒక లైన్ అయితే ఉందని కన్ఫర్మ్ చేశారు. మరి ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :