బాలయ్య సరసన మరో హీరోయిన్ ?

బాలయ్య సరసన మరో హీరోయిన్ ?

Published on Nov 1, 2021 12:04 AM IST

‘డాన్ శీను, బలుపు, పండగ చేస్కో’ లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని ‘క్రాక్’ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ కొట్టి ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో స్టార్ హీరోయినే ఉండాలని ప్లాన్ చేసిన గోపీచంద్, శృతి హాసన్ ను బాలకృష్ణ సరసన హీరోయిన్ గా తీసుకున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి.

అయితే, తాజాగా బాలయ్య సరసన మరో పేరు కూడా వినిపిస్తోంది. హీరోయిన్ భావనను ఒక హీరోయిన్ గా ఈ సినిమాలో తీసుకోబోతున్నారని కొత్త రూమర్ వినిపిస్తోంది. ఇక బాలయ్య బాబుకు సరిపోయే కథను గోపీచంద్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ చరిత్రకారుడి కథ ఆధారంగా గోపీచంద్ బాలయ్యకు కథ చెప్పాడట. ఇక బోయపాటి దర్శకత్వంలో బాలయ్య హీరోగా చేస్తోన్న అఖండ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు