బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు “బజార్ రౌడీ” ట్రైలర్ విడుదల

Published on Aug 17, 2021 4:36 pm IST

బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో కెఎస్ క్రియేషన్స్ పతాకంపై బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా మహేశ్వరి హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం బజార్ రౌడీ. ఈ చిత్రానికి వసంత నాగేశ్వరరావు దర్సకత్వం వహిస్తున్నారు. సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 20 న 300 థియేటర్స్ లలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు క్లీన్ సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సందర్భంగా పాత్రికేయుల చేతుల మీదుగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత సందిరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ, మీడియా లేనిదే మేము లేము అందుకే సినీ పాత్రికేయుల చేతుల మీదుగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశామని తెలిపారు. యూనిట్ అంతా ఎంతో ఉత్సాహంగా సహకరించినందుకు చిత్రం బాగా వచ్చిందని అన్నారు. ఈ సినిమాకు విజయ్ కుమార్ గారు అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించారు, ఈ చిత్రం చూసిన ప్రేక్షకులందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని, ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని కోరుతున్నా అని అన్నారు.

ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ రాకేష్ మాట్లాడుతూ, సంపూర్ణేష్ బాబు పక్కా మాస్ క్యారెక్టర్‌లో ప్రేక్షకులను అలరించడానికి ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడని, సంపూ గారి కెరీర్ లో ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అని అన్నారు.

చిత్ర దర్శకుడు వసంత నాగేశ్వరరావు మాట్లాడుతూ, చిత్ర యూనిట్ అందరూ కూడా ఎంతో డెడికేటెడ్ గా పని చేశారని అన్నారు. నిర్మాత వ్యవసాయదారుడైనా కూడా సినిమా పై ఉన్న అభిమానం తో సినిమా బాగా రావాలని దగ్గరుండి అన్ని విభాగాలను హ్యాండిల్ చేస్తూ ఖర్చుకు వెనుకాడకుండా చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారని ప్రశంసించారు. సంపూర్ణేష్ బాబు ను హృదయ కాలేయం, కొబ్బరి మట్ట ల లో కాకుండా తను మరో యాంగిల్ లో చూపించినట్లు చెప్పుకొచ్చారు. ప్రేక్షకులందరూ కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం తనకు ఉంది అని అన్నారు.

హీరో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ, హృదయ కాలేయం, కొబ్బరి మట్ట, సింగం 123, వైరస్ తరువాత చేస్తున్న 5 వ సినిమా బజార్ రౌడీ అని అన్నారు. సంపూర్ణేష్ గా హృదయ కాలేయం సినిమా ద్వారా రాజేష్ గారు తనను ప్రేక్షకులకు పరిచయం చేశారని, ఇప్పటివరకు విడుదలైన చిత్రాలన్నీ ఒక ఎత్తయితే బజార్ రౌడీ చిత్రం ఒక ఎత్తు అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమా తన జర్నీ కి మరో మెట్టు అవుతుందని, ఈ సినిమా లాక్ డౌన్ కంటే ముందే విడుదల కావాల్సిందని, కరోనా కారణంగా కాస్తా అలస్యమైందని చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో ఎంతో మంది సీనియర్ ఆర్టిస్ట్ లతో నటించడం ఎంతో అదృష్టం గా భావిస్తున్నా అని అన్నారు. కెమెరా మెన్ శ్రీనివాస్ గారికి ఆయన కెరియర్ లో తన సినిమానే చిన్న సినిమా అయ్యి ఉంటుంది అని అన్నారు. ఈ సినిమా ఇంతదూరం రావడానికి నిర్మాత ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారని అన్నారు. తనకు ఇంత మంచి అవకాశం కల్పించిన నిర్మాతకు వేదిక మీదే పాదాభివందనం చేస్తున్నా అని అన్నారు. గత చిత్రాల మాదిరే ఈ చిత్రాన్ని కూడా ఆదరించాలని మనస్పూర్తిగా కోరుతున్నా అంటూ చెప్పుకొచ్చారు.

హీరోయిన్ మహేశ్వరి మాట్లాడుతూ, ఈ చిత్రంలో తనకీ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు. తను హీరోయిన్ గా ఇంతదూరం రావడానికి కారణమైన తన తల్లితండ్రులకు, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని అన్నారు. సినిమా ఇన్ని థియేటర్స్ లలో విడుదల అవుతుంది అంటే కేవలం ప్రొడ్యూసర్ ప్యాషన్ మాత్రమే అని అన్నారు. నిర్మాత వయసులో ఎంతో పెద్ద వారైనా ప్యాసినెట్ తో 24 క్రాఫ్ట్స్ దగ్గరుండి చూసుకున్నారు అని అన్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :