అమీర్ ఖాన్ ‘పీకే’ ను వెనక్కు నెట్టిన ‘బాహుబలి-2’ !


‘బాహుబలి – ది కంక్లూజన్’ చిత్రం రిలీజవ్వక ముందు రికార్డుల పరంగా ఈ సినిమా చాలా పాత రికార్డుల్ని సులభంగా బీట్ చేస్తుందని కానీ అమీర్ ఖాన్ ‘పీకే’ లైఫ్ గ్రాస్ ను బీట్ చేయడం మాత్రం కాస్త కష్టమైన విషయమేనని ట్రేడ్ అనలిస్టులు భావించారు. కానీ బాహుబలి మాత్రం వాళ్ళ అంచనాల్ని తారుమారు చేస్తూ లాంగ్ రన్ వరకు కాకుండా కేవలం రిలీజైన 6 రోజులకే పీకే రికార్డును చాలా సులభంగా అధిగమించేసింది.

గతంలో ప్రపంచవ్యాప్తంగా పీకే లైఫ్ టైమ్ గ్రాస్ రూ.745 కోట్లుగా ఉండగా బాహుబలి మొదటి ఆరు రోజుల్లో వరల్డ్ వైడ్ గా సుమారు రూ. 770 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. దీంతో అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రం అనే ఘనత తెలుగు సినిమా పేరిట నిలిచిపోయింది. అంతేగాక ఈ కలెక్షన్ల జోరు చూస్తుంటే సినిమా ఇంకొద్ది రోజుల్లోనే రూ. 1000 కోట్ల మార్కును కూడా అందుకునే అవకాశముంది.