రూ.1000 కోట్ల మ్యాజికల్ ఫిగర్ కి చేరువలో ‘బాహుబలి-2’ !


రాజమౌళి అద్బుత సృష్టి ‘బాహుబలి -2 ‘ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఇండియన్ సినిమాల పేరిట ఉన్న అన్ని రకాల రికార్డుల్ని తుడిచిపెట్టేసిన ఈ సినిమా ఈరోజుటితో ఇంకో అద్భుతాన్ని సృష్టించనుంది. నిన్నటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం వసూలు చేసిన మొత్తాన్ని లెక్కగడితే రూ. 1000 కోట్ల గ్రాస్ కు దగ్గరగా ఉంది.

ఆ మొత్తానికి ఈరోజు వసూలు కానున్న కలెక్షన్లలో కొంత మొత్తాన్ని కలుపుకుంటే రూ. 1000 కోట్ల గ్రాస్ మార్క్ దాటిపోనుంది. ఈ మ్యాజికల్ ఫిగర్ తో ఇప్పటి వరకు ఏ భారతీయ చిత్రం సాధించలేని ఘనతను తెలుగు సినిమా దక్కించుకోనుంది. అంతేగాక ఈ చిత్రం ఇప్పటికే రూ. 800 కోట్లు, రూ. 900 కోట్ల రికార్డుల్ని తన ఖాతాలో వేసుకుంది. కేవలం 9 రోజుల్లోనే ఇంట భారీ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం లాంగ్ రన్ లో ఇంకెన్ని కొత్త రికార్డుల్ని సృష్టిస్తుందో చూడాలి.