యూఎస్ లో రూ. 100 కోట్ల మార్క్ అందుకున్న ‘బాహుబలి-2’ !


‘బాహుబలి – ది కంక్లూజన్’ చిత్రం యొక్క దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. విడుదలైన ప్రతి చోట దాదాపు హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్న ఈ సినిమా వసూళ్ల పరంగా ఊహకందని రికార్డుల్ని సృష్టిస్తోంది. ఇప్పటికే ఓవర్సీస్ మార్కెట్లో అన్ని ఇండియన్ సినిమాలు పాత రికార్డుల్ని బద్దలు కొట్టిన ఈ సినిమా ఈరోజుటితో ఇంకో సరికొత్త ఘనతను సొంతం చేసుకుంది.

విడుదలైన మొదటి వారం రోజులకు కలిపి 13. 08 మిలియన్ డాలర్లు అనగా రూ. 84. 5 కోట్ల పైగానే వసూలు చేసిన ఈ చిత్రం 8వ రోజు శుక్రవారం 8.28 లక్షల డాలర్లను, శనివారం నాడు 15. 1 లక్షల డాలర్లను రాబట్టి మొత్తంగా 15. 42 మిలియన్ల డాలర్లను అనగా రూ. 100 కోట్ల పై చిలుకు వసూళ్లను తన ఖాతాలో వేసుకుని ఓవర్సీస్లో సైతం 100 కోట్ల గ్రాస్ అందుకున్న మొట్ట మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది.