వైరల్..బీస్ట్ మైక్ టైసన్ ని మీట్ అయ్యిన “లైగర్”.!

Published on Nov 16, 2021 12:00 pm IST

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తీస్తున్న నెక్స్ట్ లెవెల్ సినిమా “లైగర్”. పాన్ ఇండియన్ నుంచి హాలీవుడ్ లెవెల్ ఫ్రేమ్స్ తో తయారవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరీకి ఎంతో క్లిక్ అయ్యిన బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాక్సింగ్ డైనమైట్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరి మొట్టమొదటి సారిగా తమ బీస్ట్ మైక్ ను లైగర్ విజయ్ దేవరకొండ ఈ సినిమా సెట్స్ లో మీట్ అయ్యినట్టుగా మేకర్స్ తెలిపారు. చిత్ర యూనిట్ యూ ఎస్ లోని కీలక షెడ్యూల్ నిమిత్తం వెళ్లగా అక్కడ విజయ్ మరియు మైక్ లపై కీలక సన్నివేశాలు ఉన్నాయట. ఈ సందర్భంగా ఈ ఇద్దరు కలిసి ఉన్న పిక్ ని మేకర్స్ బయటకి వదలగా అది ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :