‘అరబిక్ కుతు’ పూర్తి వీడియో సాంగ్ వచ్చేసిందిగా..!

Published on May 10, 2022 2:20 am IST


తమిళ సూపర్ స్టార్ విజయ్, పూజాహెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “బీస్ట్”. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాలతో ఏప్రిల్ 13న విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ చిత్రం ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌, సన్‌ ఎన్‌ఎక్స్‌టీలో మే 11 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. అయితే ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చిన విషయం తెలిసిందే.

అందులో ముఖ్యంగా ‘అరబిక్ కుతు’ (హలమితి హబీబో) సాంగ్‌ యూట్యూబ్‌లో రికార్డు క్రియేట్‌ చేసింది. సుమారు 260 మిలియన్లకుపైగా వ్యూస్ సొంతం చేసుకుంది. అయితే తాజాగా ‘అరబిక్‌ కుతు’ పూర్తి పాటను మేకర్స్‌ విడుదల చేశారు. విజయ్ స్టెప్పులు, పూజా హెగ్డే గ్లామర్‌తో నిండిన ఈ సాంగ్‌ మరెన్ని రికార్డులు క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :