యూట్యూబ్ రికార్డులను తిరగరాస్తున్న విజయ్ సాంగ్..!

యూట్యూబ్ రికార్డులను తిరగరాస్తున్న విజయ్ సాంగ్..!

Published on Mar 10, 2022 2:05 AM IST


తమిళ స్టార్ హీరో విజయ్, పూజ హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ యాక్షన్ థ్రిల్లర్ “బీస్ట్”. . సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ చిత్రం నుంచి వాలంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ సింగిల్ “అరబిక్ కుతు” ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది.

తాజాగా ఈ సాంగ్ 150 ప్లస్ వ్యూస్ మార్క్‌ని దాటింది. రిలీజైన 23 రోజుల్లోనే 150 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. అయితే సౌత్ ఇండియాలోనే అత్యంత వేగంగా ఇన్ని వ్యూస్ సాధించిన సాంగ్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. అంతేకాదు 4.4 మిలియన్ల లైక్స్‌ని కూడా ఈ సాంగ్ సాధించింది. ఇదిల ఉంటే ఈ పాటను అనిరుధ్ ఆలపించగా, శివకార్తికేయన్ సాహిత్యం అందించాడు. అరబిక్ పదాలే కాకుండా తమిళ్ పదాలను కూడా ఈ పాటలో వాడారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు