అక్కడ విజయ్ “బీస్ట్” చిత్రంను బ్యాన్ చేసిన ప్రభుత్వం

Published on Apr 5, 2022 12:30 pm IST


విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన బీస్ట్ చిత్రం విడుదల కి సిద్దం అవుతోంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ను కువైట్ లో బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది. కువైట్ సమాచార మంత్రిత్వ శాఖ బీస్ట్ ను నిషిధిస్తూ, నిర్ణయం తీసుకుంది. అయితే ఇందుకు గల కారణాలు సైతం చర్చాంశనీయం గా మారింది. పాక్ టెర్రరిస్టులు మరియు హింస ను చిత్రీకరించిన కారణం గా బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే అక్కడ కురుపు మరియు FIR చిత్రాలను అక్కడి ప్రభుత్వం బ్యాన్ చేయడం జరిగింది. తాజాగా బీస్ట్ చిత్రం ను బ్యాన్ చేయడంతో మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. అక్కడి సెన్సార్ మరింత కఠినంగా ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ బీస్ట్ చిత్రం ఏప్రిల్ 13 వ తేదీన విడుదల కి సిద్దం అవుతుంది. ఈ చిత్రం లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :