విజయ్ “బీస్ట్” రిలీజ్ పై క్లారిటీ…సరికొత్త పోస్టర్ విడుదల!

Published on Dec 31, 2021 9:32 pm IST

తలపతీ విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం బీస్ట్. ఈ చిత్రం ను సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ఒక పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రం రిలీజ్ మంత్ ను ప్రకటించడం జరిగింది. ఈ పోస్టర్ లో విజయ్ గెటప్ ప్రేక్షకులని, అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం ను వచ్చే ఏప్రిల్ 2022 లో విడుదల చేస్తున్నట్లు తెలిపింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :