బీస్ట్ ట్రైలర్.. అదిరిపోయేలా యాక్షన్ సీన్స్..!

Published on Apr 2, 2022 7:15 pm IST

తమిళ స్టార్ హీరో విజయ్, పూజాహెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “బీస్ట్”. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలతో ఏప్రిల్ 13న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలకి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది.

అయితే అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ని తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. దాదాపు 2:56 నిమిషాల నిడివి కలిగిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. ఉగ్రవాదం నేపథ్యం చుట్టూ ఈ సినిమా కథ ఉంటుందని ట్రైలర్ను చూస్తే అర్థం అవుతుంది. ఇందులో విజయ్ యాక్టింగ్, యాక్షన్ సన్నివేశాలు కూడా మరో లెవల్లో ఉన్నాయి. ‘రాజకీయ నాయకుడిని కాదు.. సైనికుడిని’ అన్న డైలాగ్ ట్రైలర్కు హైలెట్గా నిలిచింది. ఇక ట్రైలర్‌లో అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఏదేమైనా ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలను పెంచిందనే చెప్పాలి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :