“బీస్ట్” నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది..!

Published on Mar 19, 2022 7:05 pm IST


తమిళ స్టార్ హీరో విజయ్, పూజాహెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ యాక్షన్ థ్రిల్లర్ “బీస్ట్”. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి వాలంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ సింగిల్ “అరబిక్ కుతు” సాంగ్‌కి ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్ సాంగ్‌ని రిలీజ్ చేశారు. “జాలీ ఓ జింఖానా” అంటూ సాగే ఈ సాంగ్‌లో విజయ్, పూజాహెగ్ధే స్టెప్పులు అలరించాయి. ఈ పాటని హీరో విజయ్ పాడడం విశేషం. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి కు.కార్తిక్ లిరిక్స్ అందించగా, అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :