“పక్కా కమర్షియల్” నుంచి ఆసక్తిగా ఏంజెల్ రాశీ ఖన్నా.!

Published on Nov 30, 2021 11:41 am IST


మన టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా గ్లామరస్ హీరోయిన్ రాశీ ఖన్నా హీరోయిన్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ “పక్కా కమర్షియల్”. మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎంటర్టైనింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది. మరి ఇదిలా ఉండగా ఈరోజు రాశీ ఖన్నా బర్త్ డే కావడంతో మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ ని రిలీజ్ చేసారు.

మారుతీ తన లాస్ట్ సినిమా “ప్రతి రోజు పండగే”లో రాశిని ఏంజెల్ ఆర్ణా అంటూ చిన్న కామికల్ గా చూపించారు. కానీ ఈసారి మాత్రం నిజమైన ఏంజెల్ లా చూపించారు. తన బర్త్ డే స్పెషల్ గా రివీల్ చేసిన ఈ వీడియో చాలా బాగుంది. అలాగే ఇందులో టోటల్ సెటప్ లో బన్నీ వాస్ అత్యున్నత నిర్మాణ విలువలు కనిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా చిత్రం శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :