‘భీమ్లా’ ట్రైలర్ కన్నా ముందే మరో 1 మిలియన్ రికార్డ్ అందుకున్న పవన్!

Published on Feb 22, 2022 8:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు హీరోలుగా నటించిన లేటెస్ట్ మాస్ చిత్రం “భీమ్లా నాయక్” నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రైలర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చెయ్యగా దానికి ఇప్పుడు భారీ రెస్పాన్స్ వస్తుంది.. అయితే మన టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ కలిగిన హీరోగా మొట్ట మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలిచిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ట్రైలర్ కూడా అదే స్పీడ్ లో వెళ్తుండగా దానికి ముందే ఇప్పుడు పవన్ మరో 1 మిలియన్ లైక్డ్ వీడియో ని తన ఖాతాలో వేసుకున్నాడు. భీమ్లా నాయక్ లో థమన్ ఇచ్చిన మరో సూపర్ హిట్ అండ్ మాస్ సాంగ్ ‘లాలా భీమ్లా’ లేటెస్ట్ గా 1 మిలియన్ లైక్స్ అందుకొని పవన్ ఖాతాలో మూడో వీడియోగా రికార్డు అందుకుంది. మొత్తంగా అయితే మన టాలీవుడ్ లో అధిక 1 మిలియన్ లైక్స్ కలిగిన మరో హీరోగా పవన్ నిలిచాడు అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :