రిలీజ్ కి ముందే “కల్కి” వసూళ్ల వర్షం

రిలీజ్ కి ముందే “కల్కి” వసూళ్ల వర్షం

Published on Jun 23, 2024 10:02 AM IST

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో చేసిన అవైటెడ్ భారీ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం ప్రపంచ ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రంలో సెన్సేషనల్ కాస్ట్ నటించగా అంతకంతకు మంచి అంచనాలు సినిమాపై పెరుగుతూ వెళ్తున్నాయి.

అయితే ఈ సినిమా ఇంకా థియేటర్స్ లోకి రాకుండానే వసూళ్ల పరంగా దుమ్ము లేపుతుంది అని చెప్పాలి. యూఎస్ మార్కెట్ లో ఈ సినిమాకి బుకింగ్స్ ఆల్రెడీ ఓపెన్ కాగా అక్కడ మాత్రం ప్రీ సేల్స్ వసూళ్లు కల్కి దుమ్ము లేపింది. తాజాగా ఈ చిత్రం 2.6 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటేసి ఏకంగా 3 మిలియన్ డాలర్స్ వసూళ్ల దిశగా దూసుకెళ్తుంది.

21 కోట్లకి పైగా గ్రాస్ ని ఇంకా రిలీజ్ కి ముందే కొట్టేసింది అని చెప్పాలి. మొత్తానికి అయితే కల్కి మేనియా మామూలు లెవెల్లో లేదని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు