కన్ఫర్మ్..”సర్కారు వారి” బొమ్మ పడే లోపు మరో రెండు సాలిడ్ ట్రీట్ లు.!

Published on May 1, 2022 9:00 am IST


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురాం పెట్ల తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా వాటికి ఎక్కడా తగ్గకుండా ఉండేలా రిలీజ్ ని కూడా మేకర్స్ ప్లాన్ లు వేస్తున్నారు.

అయితే ఈ గ్యాప్ లో కూడా సినిమా పై అంచనాలు తగ్గకుండా ఉండే విధంగా మరో రెండు సాలిడ్ ట్రీట్స్ ఉండబోతున్నట్టుగా సంగీత దర్శకుడు థమన్ లేటెస్ట్ గా కన్ఫర్మ్ చేసేసాడు. ట్రైలర్ రిలీజ్ అయ్యాక తాము మరో రెండు పాటలు రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నామని వాటిలో ఒక పక్కా మాస్ సాంగ్ కాగా..

మరొకటి సినిమాలోని ఇంకో మెలోడీ సాంగ్ అని తెలియజేసాడు. అంటే ఇక థియేటర్స్ లో సర్కారు వారి బొమ్మ పడే వరకు ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ లో మోత ఆగదని చెప్పాలి. మొత్తానికి అయితే మేకర్స్ మాత్రం సాలిడ్ ప్లానింగ్స్ లో ఉన్నారని చెప్పాల్సిందే.

సంబంధిత సమాచారం :