‘స్వాతిముత్యం’ గా బెల్లంకొండ గణేష్..!

Published on Sep 14, 2021 10:52 am IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ కూడా హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. మరి ఈరోజు బెల్లంకొండ గణేష్ కొత్త సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ లాంచ్ చేసారు. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వంలో ప్లాన్ చేసిన ఈ చిత్రానికి మేకర్స్ ‘స్వాతిముత్యం” అనే ప్లెజెంట్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. అలాగే ఈ చిత్రాన్ని ఒక లవ్ అండ్ క్లీన్ ఫామిలీ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్నారట.

ఈ టైటిల్ వినగానే కమల్ హాసన్ సినిమా గుర్తు రాక మానదు మరి ఇంత కాన్ఫిడెంట్ గా టైటిల్ ని పెట్టారంటే సినిమా కంటెంట్ కూడా స్ట్రాంగ్ గానే ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఇందులో బెల్లంకొండ గణేష్ ఏదో ఆఫీస్ ఎంప్లాయ్ గా సింపుల్ లుక్స్ లో ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తుండగా మహతి సాగర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :