ప్లెజెంట్ ఎంటర్టైనింగ్ గా బెల్లంకొండ గణేష్ “స్వాతిముత్యం” ఫస్ట్ గ్లింప్స్.!

Published on Jan 15, 2022 4:14 pm IST

మన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసులుగా మొదట యంగ్ అండ్ టాలెంటడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పరిచయం కాగా తర్వాత తన సోదరుడు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అవుతున్న తాజా చిత్రం “స్వాతిముత్యం”. అయితే గత కొన్నాళ్ల కితం వచ్చిన ఈ సినిమా లుక్స్ మంచి బజ్ ని క్రియేట్ చేసాయి.

మరి ఈరోజు సంక్రాంతి కానుకగా మేకర్స్ ఫస్ట్ గ్లింప్స్ వీడియో ని రిలీజ్ చేసారు. లక్ష్మణ్ కే కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రంలో యంగ్ యాక్ట్రెస్ వర్ష బొల్లమ్మ నటించింది. అయితే ఈ గ్లింప్స్ మాత్రం మంచి ఎంటర్టైనింగ్ గా మరియు ప్లెజెంట్ గా ఉందని చెప్పాలి. రావు రమేష్ డైలాగ్స్ అలాగే గణేష్ నటన వర్ష బొల్లమ్మ లపై సీన్స్ మంచి క్యూట్ గా ఉన్నాయి.

అలాగే మహతి స్వర సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్టింగ్ కొద్ది నిముషాలు బాగుంది కానీ తర్వాత బిట్ ఎక్కడో విన్నట్టే అనిపిస్తుంది. అలాగే సూర్య సినిమాటోగ్రఫీ కూడా మంచి కలర్ ఫుల్ గా అనిపిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ వారి నిర్మాణ విలువలు ఈ సినిమాలో పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నాయి. మొత్తానికి అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకునే విధంగా ఈ గ్లింప్స్ ఉంది.

గ్లింప్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :