‘భైరవం’పై బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాన్ఫిడెంట్!

‘భైరవం’పై బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాన్ఫిడెంట్!

Published on Jan 20, 2025 9:00 PM IST

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘భైరవం’. ఈ సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్‌లు, చార్ట్-బస్టర్ ఫస్ట్ సింగిల్‌తో మంచి బజ్ క్రియేట్ చేసింది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌పై డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కాగా, నేడు ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్.

ఇక టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ..‘ఈసారి మంచి కథా బలం ఉన్న సినిమాతో రావాలని బలంగా నిర్ణయించుకునే వస్తున్నాం. ‘జయ జానకి నాయక’కు మించి ఒక సినిమా చేయాలని నిర్మాత శ్రీధర్ గారితో చెప్పాను. అలా భైరవం లాంటి మంచి కథ దొరికింది. ఈ సినిమాని డైరెక్టర్ విజయ్ గారు వోన్ చేసుకున్న విధానం సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ సినిమాని రోహిత్ గారు ఒప్పుకోవడం మోస్ట్ హ్యాపీ మూమెంట్. ఈ కథకు రోహిత్ గారు మనోజ్ గారు తప్పితే ఎవరు చేయలేరనేలా అంత గొప్పగా చేశారు. వాళ్లతో వర్క్ చేసే అవకాశం ఒక బ్లెసింగ్ గా భావిస్తున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ చక్కటి పాటలను అందించారు. అతిధి, ఆనంది, దివ్య అద్భుతంగా నటించారు. ఇది ఒక మెమరబుల్ మూవీ అవుతుంది.’ అని అన్నారు.

హీరో మనోజ్ మంచు మాట్లాడుతూ..‘విజయ్ ఈ కథ చెప్పిన వెంటనే నాకు చాలా నచ్చింది. ఇందులో నా బ్రదర్ రోహిత్, సాయి ఉన్నారని చెప్తే ఇంకా ఎక్సైట్ అయ్యాను. వెంటనే ఒప్పుకున్నాను. డైరెక్టర్ విజయ్ చాలా డెడికేటెడ్ గా ఈ సినిమాని తీశారు. నిర్మతలు రాధా మోహన్ గారికి, శ్రీధర్ గారికి థాంక్యూ సో మచ్. ఈ సినిమా గొప్ప విజయం కావాలని మా అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అతిథి సింగర్, మంచి డాన్సర్. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది జస్ట్ టీజర్ మాత్రమే. ట్రైలర్ అదిరిపోతుంది. సినిమా దుమ్ము లేచిపోతుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

హీరో నారా రోహిత్ మాట్లాడుతూ..‘భైరవం నా కెరియర్‌లో ఎప్పుడూ చేయని ఒక క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్ ని తీసుకొచ్చిన విజయ్ కి థాంక్యూ. సినిమాని నాలుగు నెలల్లో కంప్లీట్ చేయడానికి డైరెక్టర్ విజయ్, ప్రొడ్యూసర్ రాధా మోహన్ గారి సపోర్టే కారణం. మనోజ్ నాకు చిన్నప్పటినుంచి పరిచయం. కానీ ఈ సినిమా మమ్మల్ని మరింత దగ్గర చేసింది. ఈ సినిమాతో మరో బ్రదర్ సాయి వచ్చారు. సాయితో వర్క్ చేయడం వండర్‌ఫుల్ జర్నీ. సెట్స్ లో చాలా ఎంజాయ్ చేసాం. ఇది నాకు మోస్ట్ మెమొరబుల్ ఫిలిం. ఈ సినిమా విజయం సాధించి విజయ్ మరెన్నో పెద్ద సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.’ అని అన్నారు.

డైరెక్టర్ విజయ్ కనకమేడల మాట్లాడుతూ..‘మనోజ్ అన్న, సాయి గారు, రోహిత్ గారు నన్ను ఒక సొంత బ్రదర్ లాగా చూసి చాలా సపోర్ట్ చేశారు. వారి సపోర్ట్ తో సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. శ్రీ చరణ్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. వెన్నెల పాట బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నిర్మాత రాధ మోహన్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మించారు. ఈ సినిమాలో పని చేస్తున్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ముగ్గురు హీరోలతో కలిసి పని చేయడం నాకు చాలా అద్భుతమైన అనుభూతి.’ అని అన్నారు.

ఇక ఈ ఈవెంట్‌లో హీరోయిన్ అదితి శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల, నిర్మాత కెకె.రాధామోహన్ తదితరులు పాల్గొని మాట్లాడారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు