పొలాచ్చిలో షూటింగ్ జరుపుకోనున్న బెల్లంకొండ సినిమా !


యంగ్ హీరో ‘బెల్లంకొండ శ్రీనివాస్’ తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘జయ జానకి నాయక’ చిత్రం విజయాన్ని అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. దీంతో హీరోగా మొదటి కమర్షియల్ హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ రెట్టించిన ఉత్సాహంతో తన రెండవ సినిమా శూయింగ్ ను కూడా జోరుగా కొనసాగిస్తున్నాడు.

దర్శకుడు శ్రీవాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను తమిళనాడులోని ఫేమస్ లొకేషన్ అయిన పొల్లాచ్చిలో షూట్ చేసేందుకు ప్లాన్ చేశారు చిత్ర టీమ్. అంతేగాకా ఈ సినిమాలో జగపతిబాబు, మీనాలతో పాటు మరో కీ రోల్ కోసం ప్రముఖ నటుడు ఒకర్ని సంప్రదిస్తున్నారట దర్శక నిర్మాతలు. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమాను అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.