జోరు పెంచిన యంగ్ హీరో..!
Published on Jun 13, 2017 8:41 am IST


ప్రముఖ నిర్మాత బెల్లం కొండ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లకొండ శ్రీనివాస్ డాన్సులు, ఫైట్ లతో అలరిస్తున్నాడు. కానీ అతడికి సరైన విజయం దక్కలేదు. ఓపక్క క్రేజీ దర్శకుడు బోయపాటి చిత్రంలో నటిస్తూనే మరో చిత్రాన్ని ఈ యంగ్ హీరో ప్రారంభించడం విశేషం. ఈ మధ్యనే శ్రీవాస్ దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో చిత్రాన్ని బెల్లం కొండ శ్రీనివాస్ ప్రారంభించాడు.

కాగా నిన్ననే ఈ చిత్ర రెగులర్ షూటింగ్ ప్రారంభమైంది.రామోజీ ఫిల్మ్ సిటీ లో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. బోయపాటి, శ్రీవాస్ లు దర్శకత్వం వహించే చిత్రాలు తన కెరీర్ ని గాడిలో పెడతాయని ఈ యంగ్ హీరో నమ్మకంతో ఉన్నాడు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

 
Like us on Facebook