రేపే బెల్లంకొండ శ్రీనివాస్ – బోయపాటి శ్రీను మూవీ లాంచ్

Bellamkonda-Srinivas

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా ‘అల్లుడు శీను’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్.మొదరి సినిమాతోనే కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ తో చాన్స్ కొట్టేసిన శ్రీనివాస్ తన రెండవ సినిమా మాస్ పల్స్ తెలిసిన బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేస్తుండడం విశేషం. ఈ సినిమా రేపు అనగా ఆగష్టు 27న అన్నపూర్ణ స్టూడియోస్ లో లాంచనంగా ప్రారంభం కానుంది.

బెల్లంకొండ సురేష్ బాగా గ్రాండ్ గా ప్లాన్ చేసిన ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీలోని పలువురు హీరోలు, పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. మొదటి సినిమాలో సమంత లాంటి స్టార్ హీరోయిన్ తో నటించే అవకాశం కొట్టేసిన బెల్లంకొండ శ్రీనివాస్ తన సెకండ్ మూవీలో కూడా మరో స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నాతో కలిసి రొమాన్స్ చేయనున్నాడు. బోయపాటి శ్రీను యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. బెల్లంకొండ సురేష్ నిర్మించనున్న ఈ సినిమా సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది.

Exit mobile version