
సినీ ప్రముఖులపై అప్పుడప్పుడు పలు కారణాల వల్ల దాడులు జరుగుతుంటాయి. ఇదే కోవలోనే గత కొద్ది రోజులుగా మీడియాలో ప్రముఖ నిర్మాత అయిన బెల్లంకొండ సురేష్ ఆఫీసు పైన దాడులు జరిగాయి, ఆయనపై కూడా దాడి జరిగిందనే వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం బెల్లంకొండ వాహనం ఒక యువకుడిని గుద్దడం, ఆ యువకుడు ప్రస్తుతం హాస్పిటల్ లో ఉండడం. కానీ తాజాగా బెల్లంకొండ తనపైన జరిగిన దాడిలో వాస్తవం లేదని అన్నాడు.
ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో మీడియా ముందుకు వచ్చిన బెల్లంకొండ సురేష్ ‘నా ఆఫీస్ మీద ఎవరు దాడి చేయలేదు, అలాగే నా మీద ఎవరూదాది చేయలేదు. బయట వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. మీడియా వారు ఒక వార్త రాసే ముందు నిజా నిజాలు తెలుసుకొని రాయాలని’ ఆయన అన్నాడు. బెల్లంకొండ సురేష్ ప్రస్తుతం ‘గంగ(ముని 3)’ సినిమాని రిలీజ్ చెయ్యాలనే పనిలో ఉన్నాడు. అన్నీ కుదిరితే గంగ సినిమా మే 1న రిలీజ్ అవుతుంది.