అనిల్ పి .జి .రాజ్ దర్శకత్వంలో తార క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త బ్రహ్మానందరెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘బైలంపుడి’. హరీష్ వినయ్, అనుష్క తివారి జంటగా నటిస్తోన్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో రూపొందుతుంది. ప్రస్తుతం వైజాగ్ దగ్గర చోడవరంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. గురువారం ఫిలించాంబర్ లో ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నిర్మాత బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ…‘‘ సినిమా మీద ఆసిక్తతో తొలిసారిగా నిర్మాతగా ‘బైలంపుడి’ చిత్రాన్ని నిర్మిస్తున్నా. ఒక మంచి సినిమా నిర్మించాలన్న కల ఈ సినిమాతో నెరవేరుతోంది. బైలంపుడి అనే గ్రామంలో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే రివేంజ్ డ్రామా ఇది. ప్రతి పాత్ర చాలా సహజంగా ఉంటుంది. ఓ వినూత్నమైన కథతో దాదాపు అంతా కొత్తవారితో తెరకెక్కుతోన్న మా చిత్రాన్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు.
ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన మిస్ ఫేమ్ ఇండియా 2018 షాలు సోని మాట్లాడుతూ…‘‘బ్రహ్మానంద రెడ్డిగారు ఒక మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేస్తున్నారు. ఫస్ట్‌లుక్ పోస్టర్ చాలా బావుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ “అన్నారు.
