ప్రెస్ నోట్ : బెస్ట్ & ఫైర్ అకాడెమి వారి స్టాక్ మార్కెట్ సదస్సు

Published on Sep 11, 2021 7:28 pm IST

స్ప్రింగ్ ఫీల్డ్, న్యూజెర్సీ, అమెరికా: సెప్టెంబర్ 3-6, 2021

తెలుగు ప్రజలు దేశ విదేశాలలో, ఖండాంతరాలలో వైద్యరంగం లోనూ, ఐటీ రంగంలోనూ మరియూ వ్యాపార రంగాలలోనూ విజయకేతనాలు ఎగరవేస్తున్నారు. కానీ ఇప్పటికి స్టాక్ మార్కెట్ అనగానే చాలామంది దాన్ని ఒక జఠిలమయిన, నిషిద్దమైన సమస్య గానే చూస్తున్నారు. ఇంకొందరు పేకాటతో పోల్చుతున్నారు. నిజం చెప్పాలంటే వీరందరూ మర్చిపోతున్న ఒక ముఖ్యమైన అంశం – సంపదని అభివృద్ధి చేసుకునే అవకాశాలలో స్టాక్ మార్కెట్ కూడా ఉంది అని చరిత్ర చెబుతున్న సాక్ష్యం.

బెస్ట్ & ఫైర్ అకాడెమి వారి యొక్క ముఖ్య ఉద్దేశం – స్టాక్ మార్కెట్ మీద అందరకీ అవగాహన కల్పించటం మరియూ ఆర్థికంగా సుసంపన్నం చెయ్యడం! ముఖ్యంగా యువతనీ మరియూ మహిళలనీ. దీనికోసం గత ఆరు సంవత్సారాలుగా కొంతమంది స్టాక్ మార్కెట్ ప్రావీణులు నాట్-ఫర్-ప్రాఫిట్ సమూహంగా ఏర్పడి పేరెన్నిక కలిగిన క్రియాశీల ట్రేడర్స్ తో స్టాక్ మార్కెట్ పై శిక్షణా తరగతలు ఫ్రీగా నడుపుతూ ఉన్నారు. అంతేకాకుండా సుమారు 2000 ఏక్టివ్ ట్రేడర్స్ ఒకరికి ఒకరు నిరంతరం సహకరించుకుంటూ S&P 500 లాంటి ఇండెక్స్ ని కూడా అధిగమిస్తున్నారు.

ప్రతి సంవత్సరం నేషనల్ వర్క్ షాప్స్ చెయ్యడం అనవాయితీ మరియు వాటిలో పాల్గొన్నవారు మేదోమధనం చెయ్యడం రివాజు. ఈఏడాది బెస్ట్ & ఫైర్ జాతీయ సమావేశాలు న్యూజెర్సి రాష్ట్రంలో జరగడం ఒక ఎత్తు అయితే భయంకరమైన ఇడా తుఫాను లెక్కచెయ్యకుండా సుమారు 500 ట్రేడర్స్ సమావేశమవటం ఇంకొక ఎత్తు. అందరూ పూర్తిస్థాయి వాక్సిన్ వేయించుకున్న వారికి మాత్రమే ప్రవేశం కల్పించడమే కాకుండా డాక్టర్స్ పర్యవేక్షణలో ఎన్నో కోవిడ్ జాగ్రత్తలు తీసుకున్నారు.

వాల్ స్ట్రీట్ బేంక్స్, ఫండ్ మేనేజర్స్, అకడమిక్ ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన ప్రత్యేక అతిధిలతో, టెక్నికల్ అనాలసిస్, ఫండమెంటల్ అనాలసిస్, ఫ్యూచర్స్, క్రిప్టొ, ప్రి-ఐ.పి.ఒ లాంటి ఎన్నో కీలకమైన అంశాలపై చర్చలు జరిగాయి. ప్రత్యేక సెషన్స్ ఆప్షన్స్ ట్రేడింగ్ – పుట్స్, కాల్స్, స్ట్రేంగిల్స్, స్ట్రేడెల్స్, కేలండర్స్, బటర్ ఫ్లైస్ మరియూ డయాగినల్స్ వాటిపై కూడా శిక్షణ తరగతులు నిర్వహించడమైనది. ఉత్తర అమెరికా వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన ఏక్టివ్ ట్రేడర్స్ రిటైర్మెంట్ మరియు ఎడ్యుకేషన్ అంశాలు అయిన IRA, 401K, Roth & 529 మీద జరిగిన చర్చలపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. రియల్ ట్రేడర్స్ వారిచే రిస్క్ మేనేజ్మెంట్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ మరియు పొజిషన్ సైజింగ్ వంటి వాటి మీద శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆర్థిక స్వాతంత్రంపై మహిళలకు మరియు రేపటి చిన్నారులకు అవగాహన సదస్సు అబ్బురపరిచింది.

బిజినెస్ టైకూన్స్ శ్రీ సుబ్బు కోట గారు, శ్రీ డాక్టర్ సాయి కొల్ల గారు, శ్రీ ఉదయ్ భాస్కర్ కొట్టె గారు, శ్రీ శేఖర్ పులి గారు, శ్రీ డాక్టర్ నాగిరెడ్డి గారు మరియు శ్రీ ఆనంద్ పాలూరి (ఆండీ) గారు లాంటి పెద్దలు బ్యాంకెట్ నైట్ డిన్నర్ లో పాల్గొని చుక్కలులాగ మెరవడమే కాకుండా కాకుండా బెస్ట్ & ఫైర్ సదస్సుకి శోభను చేకూర్చారు. నాలుగు రోజులుగా ఒక 25 గంటలు ప్రాక్టికల్ శిక్షణా తరగతులు, తమ మేధస్సుని తెలుగు ప్రజలకు పంచిన నిష్ణాతులకు సన్మానాలు జరగడం ఎంతో ఆనందదాయకం.

విజ్ణానంతో కూడిన విలాసవంతమైన వర్క్ షాప్స్ నడవడానికి ముందుకు వచ్చిన దాతలు శ్రీ సుబ్బు కోట గారు, శ్రీ వెంకట్ యెరుబండి గారు, శ్రీ విజయ్ రామిశెట్టి గారు, శ్రీ ఓంప్రకాష్ నక్కా గారు, శ్రీ చంద్రశేఖర్ నల్లం గారు, శ్రీ రవి వర్రె గారు, శ్రీ సాగర్ లగిశెట్టి గారు, శ్రీ విజయ్ గుడిసేవ గారు, శ్రీ డాక్టర్ సూర్య రఘుతు గారు, శ్రీ సత్య బల్లా గారు, శ్రీ ఫణి ముత్యాల గారు, శ్రీ సురేష్ చీలంకుర్తి గారు ఇంకా మరెందరో దాతలకు & పోషకులకు హృదయ పూర్వక అభినందన మందార మాల.

బెస్ట్ & ఫైర్ జాతీయ సదస్సు నిర్వాహకులు శ్రీ వెంకట్ యెరుబండి గారు, శ్రీ విజయ్ రామిశెట్టి గారు, శ్రీ హరి కూరగాయల గారు మరియు శ్రీ జయకుమర్ చిమట గార్లకి ప్రత్యేక అభినందనలు.

ఫోటో గ్యాలరీ కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://photos.app.goo.gl/A6vkwJPKnXDSiP7k7

Content Produced by: Indian Clicks, LLC

సంబంధిత సమాచారం :