శృతి హాసన్ “బెస్ట్ సెల్లర్” వెబ్ సిరీస్ విడుదల కి సిద్దం

Published on Jan 28, 2022 10:00 pm IST

శృతి హాసన్ ఈరోజు తన 36వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా తను నటిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించిన పలు ప్రకటనలు వెలువడుతున్నాయి. ఇప్పటికే సలార్ చిత్రం నుండి ఆమె లుక్ కూడా ఆమె అభిమానులను ఆనందపరిచింది.

అమెజాన్ ప్రైమ్‌లో బెస్ట్ సెల్లర్ అనే షో తో శృతి తన హిందీ వెబ్ సిరీస్‌ లోకి అడుగుపెట్టింది. ఆమె పుట్టినరోజు సందర్భంగా, మేకర్స్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసి, ఫిబ్రవరి 18న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ షో లో ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కూడా నటించారు. రవి సుబ్రమణియన్ నవల ది బెస్ట్ సెల్లర్ ఆధారంగా ఇది రూపొందించబడింది.

సంబంధిత సమాచారం :