‘అరుంథతి’ ని గుర్తిచేసిన అనుష్క!

స్టార్ హీరోయిన్, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరైన అనుష్క తాజా చిత్రం ‘భాగమతి’ ఈ నెల 26న విడుదలకానుంది. కొన్ని రోజుల క్రితమే విడుదలైన టీజర్ ఆకట్టుకోగా ఈరోజు ట్రైలర్ రిలీజై అందరినీ థ్రిల్ చేసింది. ట్రైలర్లో ప్రేక్షకుల్ని ఎక్కువగా ఆకట్టుకున్న అంశాల్లో అనుష్క పెర్ఫార్మెన్స్ ఒకటి. ఇందులో ఈ లేడీ సూపర్ స్టార్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించారు.

అందులో ఒకటైన ‘భాగమతి’ పాత్ర ఆహార్యం, డైలాగ్స్ చూస్తుంటే అదే సినిమాకు పెద్ద హైలెట్ అవుతుందని నిస్సందేహంగా అనిపిస్తోంది. ఇక ఆ పాత్రలో అనుష్క ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ‘అరుంథతి’ ని గుర్తుచేస్తూ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. యువీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘పిల్ల జమిందార్’ ఫేమ్ అశోక్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో ఉన్ని కృష్ణన్, ఆది పినిశెట్టి, జయరామ్ లు పలు కీలక పాత్రల్లో నటించారు.

ట్రైలర్ కొరకు క్లిక్ చేయండి: