విడుదలకు సిద్దమైన ‘భాగమతి’ టీజర్

అనుష్క ప్రధాన పాత్ర లో జి.అశోక్ దర్శకత్వంలో యు.వి. క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమా ‘భాగమతి’. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రేపు (బుధవారం) ఈ మూవీ టీజర్ విడుదల చెయ్యనున్నారు చిత్ర యూనిట్. ‘బాహుబలి’ సినిమా తరువాత అనుష్క చేస్తోన్న లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాకు గ్రాఫిక్స్ వర్క్స్ ఎక్కువ ఉండడంతో సినిమా కాస్త ఆలస్యం అవుతోందని సమాచారం. ‘అరుంధతి’ తరహాలో ఈ సినిమాను నిర్మించబోతున్న యు.వి.క్రియేషన్స్ ఖర్చుకు ఎక్కడా వెనకాడడం లేదని తెలుస్తోంది. మది కెమెరా మెన్ గా పనిచేస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. తమన్ ఈ మూవీ కి స్వరాలు సమకూరుస్తున్నాడు.