కేరళలో భారీ ఎత్తున రిలీజ్ కానున్న ‘భాగమతి’ !

24th, January 2018 - 01:36:10 PM

లేడీ సూపర్ స్టార్ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘భాగమతి’ ఈ నెల 26న రిలీజ్ కానుంది. జి.అశోక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ‘బాహుబలి’ తరవాత విడుదలవుతున్న అనుష్క చిత్రం కావడంతో ఇతర భాషలు ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై అమితాసక్తిగా ఉన్నారు.

అందుకే చిత్ర నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ కేరళలో సుమారు 150 స్క్రీన్లలో చిత్రం రిలీజయ్యేలా ప్లాన్ చేసింది. దీంతో సినిమాకు భారీ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో అనుష్కతో పాటు జయరామ్, ఉన్ని ముకుందన్, ఆశా శరత్, మురళీ శర్మ వంటివారు ఈ సినిమాలో పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.