ఇంటర్వ్యూ : జి.అశోక్ – ‘భాగమతి’ లేడీ ఓరియెంటెడ్ సినిమా కాదు !

ఇంటర్వ్యూ : జి.అశోక్ – ‘భాగమతి’ లేడీ ఓరియెంటెడ్ సినిమా కాదు !

Published on Jan 24, 2018 2:33 PM IST

అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన ‘భాగమతి’ ఈ నెల 26న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు జి.అశోక్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం..

ప్ర) అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా వర్కవుట్ అయింది ?
జ) ముందుగా ఈ చిత్ర కథను 2012లో యువీ క్రియేషన్స్ వారికి చెప్పాను. తర్వాత ప్రభాస్ కి వినిపించాను. వారి సహాయంతో అనుష్కకు కూడా చెప్పాను. అందరికీ నచ్చి చేద్దామనుకున్నాం.

ప్ర) అనుష్కకు ‘బాహుబలి’ ముందే కథ చెప్పారా ?
జ) అవును. బాహుబలి మొదటి పార్ట్ షూటింగ్ కు వెళ్లకముందే ఆమె ఈ సినిమాకి ఒప్పుకున్నారు.

ప్ర) మరి ఇంత ఆలస్యమెందుకైంది ?
జ) అప్పటికే ఆమె బాహుబలికి కమిట్మెంట్ ఇచ్చి ఉండటం వలన ఆగాల్సి వచ్చింది. మధ్యలో రెండు సార్లు మొదలుపెడదామని చూసినా వీలుకాలేదు.

ప్ర) సినిమా స్టోరీ ఎలా ఉండబోతోంది ?
జ) ఇదొక యూనివర్సల్ సబ్జెక్ట్. ఏ నైపథ్యానికైనా సరిపోతుంది. ఏ పరిశ్రమలో చేసినా హిట్టవుతుంది. ఇందులో కథ ప్రతి చోటా జరిగేదే, అందరికీ పరిచయమైందే.

ప్ర) ఈ కథను అనుష్కతోనే ఎందుకు చేయాలనుకున్నారు ?
జ) ‘భాగమతి’ పాటర్ను క్యారీ చేయాలంటే ఒక స్టేచర్ ఉండాలి. ప్రేక్షకుల్లో ఒక గుర్తింపుండాలి. అవి అనుష్కలో మాత్రమే కనబడ్డాయి. అందుకే ఆమె తప్ప ఈ కథకి ఎవరూ ఎవరూ న్యాయం చేయలేరని భావించి ఆగాను.

ప్ర) సినిమా కోసం వేసిన సెట్స్ గురించి చెప్పండి ?
జ) సినిమాలో ఒక బంగ్లా సెట్ వేశాం. అది ఒక సెట్ మాత్రమే కాదు, కథలో ఒక క్యారెక్టర్. దాని చుట్టూనే కథ తిరుగుతుంది. ముందు ఒక మాదిరిగా వేద్దామని అనుకున్నాం కానీ చాలదని పూర్తిస్థాయిలో భారీగా వేశాం. 75 శాతం సినిమా అందులోనే జరుగుతుంది.

ప్ర) అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చాలా చేశారు, వాటికి దీనికి తేడా ఏంటి ?
జ) ముందుగా చెప్పాల్సింది ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా కాదు. స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. ఈ సినిమాకు అదే బలం.

ప్ర) సినిమా కోసం అనుష్క ఎలా కష్టపడ్డారు ?
జ) ఆమె లేకపోతె ప్రాజెక్ట్ లేదు. కష్టమైన సన్నివేశాల కోసం ఆమె ఎంతగానో కష్టపడ్డారు. ఎడమ చేతి భుజం గాయం బాధపెడుతున్నా, డస్ట్ ఎలర్జీ ఉన్నా వేటినీ లెక్కచేయకుండా షూటింగ్లో పాల్గొన్నారు.

ప్ర) మీ తదుపరి చిత్రాలేమైనా ప్లాన్ చేశారా ?
జ) లేదు ప్రస్తుతానికైతే ఏమీ అనుకోలేదు. రిలీజ్ తరవాత ప్రమోషన్స్ లో పాల్గొనాలి. అన్నీ పనులు పూర్తయ్యాక ఆలోచిస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు