జోరుగా ‘భాగమతి’ అడ్వాన్స్ బుకింగ్స్ !

25th, January 2018 - 01:15:14 PM

స్టార హీరోయిన్ అనుష్క నటించిన ‘భాగమతి’ చిత్రం రేపే రిలీజ్ కానుంది. ‘బాహుబలి’ తర్వాత అనుష్క చేసిన చిత్రం కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీజర్, ట్రైలర్ బాగుండటంతో ప్రీ రిలీజ్ టాక్ కూడా పాజిటివ్ గానే ఉంది. అంతేగాక ఈ శుక్రవారం వేరే పెద్ద, చిన్న సినిమాలేవీ రిలీజ్ లేకపోవడం కూడా ఈ చిత్రానికి బాగా కలిసొచ్చే అంశంగా మారింది.

దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే నడుస్తున్నాయి. యువీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తునానఁ ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ ప్రధాన బలం కానున్నాయి. అంతేగాక సినిమా మొత్తాన్ని 4కే టెక్నాలజీతో చిత్రీకరించడం మరో విశేషం. దీనివలన ప్రేక్షకులకు క్వాలిటీ ఫిల్మ్ చుసియాన్ అనుభూతి కలుగులుతుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. జి.అశోక్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్, జైరామ్ వంటి వారు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.