అప్పుడే బుల్లితెరపై “భగవంత్ కేసరి” ప్రమోషన్స్ స్టార్ట్.!

Published on Sep 20, 2023 10:01 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ డ్రామానే “భగవంత్ కేసరి”. మరి వరుస హిట్స్ అనంతం బాలయ్య నుంచి వస్తున్నా సినిమా ఇది కావడంతో గట్టి అంచనాలు దీనిపై నెలకొనగా ఈ సినిమా కోసం అయితే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ చిత్రం విషయంలో అయితే మేకర్స్ అప్పుడే ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసేసారు.

మొట్ట మొదటిగా బుల్లితెర ఆడియెన్స్ ని టార్గెట్ చేసి భగవంత్ కేసరి యూనిట్ జీ తెలుగు ఛానెల్లో ఓ ప్రోగ్రాం కి కూడా హాజరు అయ్యారు. దీనితో సినిమా రిలీజ్ కి ఇంకా నెల సమయం ఉన్న లోపలే ఇలా స్టార్ట్ చేయడం సినిమాకి బూస్టప్ అని చెప్పాలి. దర్శకుడు అనీల్ రావిపూడికి ఆల్రెడీ స్మాల్ స్క్రీన్ పై మంచి క్రేజ్ ఉంది. దీనితో మంచి ప్లానింగ్ ప్రకారమే ఇపుడు మూవ్ అవుతున్నారు అని చెప్పాలి. మరి ఈ ప్రోగ్రాంకి అయితే తనతో పాటుగా సంగీత దర్శకుడు థమన్ కూడా హాజరయ్యాడు.

సంబంధిత సమాచారం :